రామ్ చరణ్ ఉపాసన నేడు పదో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే వారి వెడ్డింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్గా మారింది. రామ్ చరణ్-ఉపాసన వివాహం జూన్ 14, 2012న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామ్చరణ్ ఫ్యాన్స్ రేపు పెద్ద ఎత్తున వారి వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ దంపతుల పేరుపై పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అదేవిదంగా అన్నదానం, రక్తదానం వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపు చరణ్, ఉపాసన యానివర్సరీ సెలబ్రేషన్స్ కోసం ఇటలీ వెళ్లారు.