RRR గురించి తెలియదన్న పాల్.. ఏకిపారేసిన RGV

తెలుగునాటే అని కాకుండా ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా కానీ RRR హవా నడుస్తోంది. ప్రతి ఒక్కరూ RRR మేనియాలో తడిసి ముద్దవుతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కే.ఏ పాల్ ఈ రోజు సోషల్ మీడియా లైవ్ కండక్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన్ను అభిమానులు RRR మూవీ చూశారా అంటూ అడిగారు. దీనికి స్పందించిన పాల్.. మీకు ఏం పనిలేదా.. విడుదలైన ప్రతి సినిమాను చూస్తారా. అసలు నేను ఎప్పుడూ RRR గురించి వినలేదు. ప్రతి రోజు ఏదో ఒక కొత్త సినిమా వస్తుంది… ఇవ్వన్నీ ఎవరు పట్టించుకుంటారని తెలిపాడు. దీనిపై తెలుగు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించాడు. ‘నీమొహం’ అంటూ ట్వీట్ చేశారు. పాల్ ఇలా వ్యాఖ్యానించడం పట్ల చాలా మంది నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు.

Exit mobile version