మాస్ మహారాజ రవితేజ హీరోగా తెరకెక్కిన రామారావు ఆన్ డ్యూటీ మూవీని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ఇది వరకే రిలీజ్ చేయాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల పోస్ట్ పోన్ చేశారు. ఇందులో రవితేజకు జోడీగా దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ నటిస్తున్నారు. శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో రవితేజ పవర్‌ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ రోల్‌లో కనిపించనున్నారు.