ఈరోజు రామ్ చరణ్ బర్త్డే. ఈ సందర్భంగా గత రాత్రి ఎన్టీఆర్తో కలిసి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది. అందులో ఎన్టీఆర్, ప్రణతి, రామ్ చరణ్, ఉపాసన, కార్తికేయ ఆయన భార్య కూడా ఉన్నారు. ఎన్టీఆర్, చరణ్ గతం నుంచి మంచి ఫ్రెండ్స్ అయినప్పటికీ ఆర్ఆర్ఆర్తో వారి స్నేహం గురించి ప్రపంచానికి తెలిసింది. సినిమా తర్వాత కూడా కొమరం భీమ్, సీతారామ రాజు ఒక్కచోట కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.