రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 15వ సినిమా చేస్తున్నాడు.ఇందులో రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లుగా సమాచారం. ఒక పాత్రలో షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తిగా కనిపించనున్నాడు. మరో పాత్రలో గ్రామంలోని ఒక రాజకీయ నాయకుడిగా నటిస్తున్నాడు. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా చాలా ఆసక్తికరంగా ఉండబోతుందని టాక్. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అరవింద్ స్వామి, ఇషా గుప్తా వంటి వాళ్లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.