నిన్న కర్ణాటకలో ఆర్ఆర్ఆర్ ప్రీ-రిలీజ్ పాన్ ఇండియా ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈవెంట్లో మాట్లాడిన రామ్‌చరణ్ పునీత్ రాజ్‌కుమార్‌ను గుర్తుచేసుకున్నారు. ఆయన ఇక్కడే ఉండి అందరినీ ఆశీర్వదిస్తున్నారని అనుకుంటున్నా అని చెప్పాడు. ఈవెంట్లో కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మొత్తానికి సినిమా వచ్చేస్తుంది ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయని నన్ను అడుగుతున్నారు. కానీ నాకు ప్రస్తుతానికి ఎలాంటి ఫీలింగ్స్ లేవు. మొత్తం బ్లాంక్‌గా ఉన్నాను. మార్చి 25న సినిమా చూసిన తర్వాత మీ రియాక్షన్ కోసం ఎదురుచూస్తున్నానని చెప్పాడు.