గొంకాలా రామోస్ హ్యాట్రిక్ గోల్స్ చేయడంతో పోర్చుగల్ స్విట్జర్లాండ్‌పై 6-1 తేడాతో ఘన విజయం సాధించింది. పోర్చుగల్ ఈ విజయంతో క్వార్టర్స్‌లో మొరాకోతో తలపడనుంది. క్రిస్టియానో రోనాల్డో స్థానంలో చోటు దక్కించుకున్న రామోస్ ప్రత్యర్థి డిఫెండర్ల గుండెల్లో గుబులు పుట్టించాడు. 17, 51, 67వ నిమిషాల్లో రామోస్ స్విస్ డిఫెన్స్‌ను ఛేదించుకుంటూ గోల్స్ కొట్టాడు. పె పె హెడర్, గురీరో, రాఫెల్ లియోలు పోర్చుగల్ తరఫున గోల్స్ సాధించారు. స్విస్ ఒకే ఒక గోల్ సాధించి ఘోర పరాభవం ఎదుర్కొంది.