ఇక్సిగో గ్రూప్‌నకు చెందిన ‘కన్ఫం టికెట్’ బ్రాండ్ అంబాసిడర్‌గా టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి వ్యవహరించనున్నారు. వెయిటింగ్ లిస్టులోని టికెట్ కన్ఫం అయ్యేందుకు ఎంతమేర అవకాశముందో ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో పాటు టికెట్ కన్ఫమ్ కాకపోతే ఏంచేయాలో ఈ యాప్ సూచనలు ఇస్తుంది. ఐఆర్సీటీసీతో ఈ యాప్‌నకు ఒప్పందం ఉంది. కాగా ప్రజల్లో రానాపై ఉన్న అభిమానం, ప్రేమ తమకు అదనపు బలం కాబోతుందని యాప్ ఫౌండర్స్ దినేశ్ కొత్త, శ్రీపాద వైద్య తెలిపారు.