స్టార్ క్రేజ్ కోసంవెంపర్లాడకుండా విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ తనకంటూ అభిమానగణాన్ని సంపాదించుకున్న నటుడు రానా. అయితే విరాటపర్వం పోస్టర్ లో రానా ముఖం తీసేయడంపై ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ….సొంత బ్యానర్ లోనే ఫేస్ తీసేశారు. ఇక మిగతా వారు వేలెత్తి చూపడంలో తప్పు లేదని విమర్శిస్తూ ట్వీట్ చేశాడు. దీనిపై రానా స్పందిస్తూ….‘మనం తగ్గి.. కథ, నాయికను ఎలివేట్ చేయడంలో ఉండే కిక్కే వేరు బ్రదర్. సొంత బ్యానర్ కదా గొప్పవన్నీ ఇక్కడే చేయొచ్చు’అంటూ చెంపపగిలే సమాధానమిచ్చారు. రానా జవాబుపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపించారు.