గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ జంట రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ త్వరలోనే పెళ్లి చేసుకోనున్నలు సమాచారం అందుతోంది. అప్పట్లో అక్టోబర్‌లో ఈ జంట పెళ్ళికి సిద్దమైనట్లు వార్తలు రాగా.. ఏప్రిల్ నెలలోనే పరిణయమాడాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే వీళ్ళు నటిస్తున్న సినిమాల దర్శక నిర్మాతల నుంచి డేట్స్ పర్మిషన్ కోరారట. అటు ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాను రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్ కలిసి పెళ్లి పనులు ప్రారంభించడం కూడా ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.