నేడు ‘బ్రహ్మాస్త్ర’ టీమ్ వైజాగ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. జూన్ 15న ట్రైలర్ విడుదల కాబోతుందని ప్రకటించింది. ఈ సమావేశంలో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ తనకు సౌత్ ఇండియన్ నటుల్లో నాకు రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ఎన్‌టీఆర్, రామ్‌చరణ్ అందరూ చాలా ఇష్టం అని వెల్లడించాడు. ఇక మీ ఫేవరెట్ తెలుగు నటులు ఎవరు అని ప్రశ్నించగా.. అందరూ ఇష్టం కానీ, డార్లింగ్ ప్రభాస్ నా ఫేవరెట్ అని చెప్పాడు.