అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కాంబోలో యానిమల్ మూవీ తెరకెక్కుతోంది. ఆగస్టు 11న ఈ మూవీని విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంటర్యూలో మాట్లాడిన రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సినిమా కథ నటుడిగా నన్ను కదిలించింది. ఇటువంటి పాత్రను నేను ఎప్పుడూ చేయలేదు. తన పాత్రలో గ్రే షేడ్స్ ఉన్నాయి. ఒక నటుడికి యానిమల్ లాంటి సినిమాలు చాలా అవసరం. దీని వల్ల కెరీర్‌లో మరింత ముందుకు దూసుకెళ్లే అవకాశం ఉంది’ అని అన్నారు.
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్