టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోని హోలీ వేడుకల సందర్భంగా రాంచీ ప్రజలకు ప్రత్యేక గిఫ్ట్ అందించారు. రాంచీ ప్రజలంతా హోలీని ఎంజాయ్ చేసేందుకు మార్చి 17 నుంచి 19 వరకు సెంబో విలేజ్‌లోని తన ఫామ్‌హౌజ్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. చుట్టుపక్కల వారిని ఎంటర్టైన్ చేసేందుకు ప్రత్యేక కార్యక్రమాలు కూడ నిర్వహించనున్నట్లు సమాచారం. దాదాపు 43 ఎకరాలు ఉన్న ఈ ఫామ్‌హౌజ్‌లో జామ, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ ఇతర పండ్ల తోటలను పండిస్తున్నారు. ధోని టీమిండియాకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ ఐపీఎల్లో చెన్నై జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్నారు.