యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’. ఒక్క పాట మినహాయించి ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది. కేతిక శర్మ ఇందులో హీరోయిన్గా నటిస్తుంది. హీరో, హీరోయిన్లు ఇద్దరూమెడికల్ స్టూడెంట్స్‌గా కనిపించనున్నారు. గిరీశాయ దర్శకత్వం వహిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఒక్క పాటను పూర్తి చేసి త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే పనిలో ఉంది చిత్రబృందం.