అఫ్గానిస్థాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ టీ20ల్లో అరుదైన ఘనతను అందుకున్నాడు. ఓవరాల్ టీ20 ఫార్మాట్లో ఈ రైట్ హ్యాండ్ లెగీ 500 వికెట్లు తీసుకున్నాడు. సౌతాఫ్రికా 2023 టోర్నీలో వికెట్లు పడగొట్టి ఈ ఫీట్ సాధించాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో రషీద్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ రైలీ రొస్సోని ఔట్ చేసి కెరీర్లో 500వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం మరో వికెట్ తీసుకుని జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడుతున్నాడు