మళ్లీ టాప్‌లో రష్మిక, యష్‌

కన్నడ మోస్ట్‌ పాపులర్‌ స్టార్స్‌ జాబితాలో మరోసారి రష్మిక, కేజీఎఫ్‌ స్టార్‌ యష్‌ అగ్రతారలుగా నిలిచారు. ఆర్మాక్స్‌ మీడియా ప్రతినెలా విడుదల చేసే ఈ జాబితాలో జులై మాసానికి కన్నడలో మోస్ట్ పాపులర్‌ ఫీమేల్‌ స్టార్‌గా రష్మి మంధాన నిలిచింది. అలాగే మోస్ట్‌ పాపులర్‌ మేల్‌ స్టార్‌గా యష్‌ స్థానం సంపాదించాడు. రెండో స్థానంలో సుదీప్‌, మూడో స్థానంలో దర్శన్‌, నాలుగో స్థానంలో ‘చార్లీ 777’ స్టార్‌ రక్షిత్ శెట్టి, ఐదో స్థానంలో శివన్న ప్రేక్షకుల ఆదరణ పొందారు.

Exit mobile version