ఈ నెల 28న తిరుమలలో రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఏటా మాఘ శుద్ధ సప్తమి నాడు రథసప్తమి ఉత్సవాన్ని తిరుమలలో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఒకే రోజు శ్రీవారు ఏడు వాహనాలపై ఊరేగనున్నారు. సూర్యప్రభ వాహనం, చిన్నశేషవాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, చక్రస్నాన వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనంపై శ్రీవారు తిరుమల మాడ వీధుల్లో ఊరేగుతారు. రథసప్తమి సందర్భంగా టీటీడీ శ్రీవారి ఆర్జిత సేవలు రద్దు చేసింది.