AP: రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20 వరకు ఉచిత రేషన్ బియ్యంను పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొబైల్ వాహనాల ద్వారా ఇంటింటికీ చేరవేస్తామని పౌరసరఫరాల శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. బియ్యంతో పాటు 500 గ్రాముల చక్కెర, కిలో కందిపప్పు అందజేస్తామని స్పష్టం చేసింది. మరోవైపు, అంత్యోదయ అన్నయోజన కార్డులు ఉన్న లబ్ధిదారులకు కిలో చక్కెరను సరఫరా చేస్తామని తెలిపింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ ప్రకటన విడుదల చేశారు.