మిథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ ట్రోలింగ్‌పై ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్ స్పందించాడు. ‘‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైన తర్వాత ట్రోలింగ్‌కు కొంత భయపడ్డాను. చిన్న తెరలపై చూడటానికి ఈ సినిమా తీయలేదు. పెద్ద తెరలపై చూడటానికి మాత్రమే తీశాం. యూట్యూబ్‌లో టీజర్ చూసి బాగాలేదనడం సమంజసం కాదు. థియేటర్‌కు దూరమైన పెద్దవాళ్లు, మూరుమూల ప్రాంతాల వారి కోసం ఈ సినిమా తీశాం. 3డీ మోషన్ క్యాప్చర్‌లో చూస్తేనే ఈ సినిమా అర్థం అవుతుంది’ అని రౌత్ చెప్పుకొచ్చాడు.