టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మున్నా చెప్పిన ఓ స్టోరీకి ఓకే చెప్పాడని వినిపిస్తోంది. అయితే ఈ డైరెక్టర్ గతంలో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాకు దర్శకత్వం వహించారు. మరోవైపు రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్నారు. అంతేకాదు రావణాసుర, ధమాకా వంటి చిత్రాలు కూడా తర్వాత లైన్లో ఉన్నాయి.