మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నా మాస్ యాక్షన్ మూవీ వాల్తేరు వీరయ్య చిత్రం నుంచి మరో అప్‌డేట్ రానుంది. సినిమాలో కీలక రోల్ చేస్తున్న హీరో రవితేజకు సంబంధించిన లుక్‌ను విడుదల చేయనున్నారు. దీనికోసం ఫ్యాన్స్ చాలారోజులుగా ఎదురుచూస్తున్నారని తనకు తెలుసన్న రవితేజ.. తనను చిత్రంలో కొత్తగా చూస్తారని వెల్లడించారు. ఈ నెల 12న ఉదయం 11.07 గంటలకు విడుదల అవుతుందని తెలిపారు. సిలిండర్‌ను కత్తితో పట్టుకొని లాక్కెళ్తున్నట్లు రవితేజ కనిపిస్తున్న పోస్టర్‌ను పెట్టారు.