రవితేజ హీరోగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. జూన్ 17న విడుదల కానున్న ఈ మూవీ నుంచి మొదటి పాట బుల్ బుల్ తరంగ్ కొద్ది రోజుల క్రితం విడుదలై ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సొట్టల బుగ్గల్లో’ అని సాగే రెండో పాటను రేపు సాయంత్రం 6.03గంటలకు విడుదల చేయనున్నారు. ఈ మేరకు మేకర్స్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ మెలోడీగా సాగుతున్న ఈ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంది. సామ్ సిఎస్ సంగీతం అందించిన ఈ మూవీని శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్నారు.