SRH బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఐపీఎల్ 2022లో అదరగొడుతున్నాడు. 156 కిలో మీటర్ల వేగంతో బంతులు వేస్తూ.. ప్రతి మ్యాచ్‌లో వికెట్లు తీసుకుంటున్నాడు. దీంతో అతడిని ఇండియన్ టీంలోకి తీసుకోవాలని పలువురు క్రికెటర్లతో పాటు.. టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కూడా సెలెక్టర్లకు సలహా ఇచ్చాడు. అయితే గత రెండు మ్యాచెస్‌లో మాలిక్ అధిక పరుగులు ఇవ్వడంతో.. అతనికి రవిశాస్త్రి ఓ సలహా ఇచ్చాడు. సరైన ఏరియాస్‌లో బౌలింగ్ వేయకుండా పేస్‌ను మాత్రమే నమ్ముకుంటే 156కి.మీ స్పీడ్ 256 పరుగులకు కారణం అవుతుందని పేర్కొన్నాడు. తన పేస్‌ను రైట్ ఏరియాల్లో ఫీల్డ్ పెట్టి, సరైన బంతులేస్తే వికెట్లు వస్తాయని సలహా ఇచ్చాడు.