మెగాస్టార్ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతుంది. దీనికి ‘వాల్తేర్ వీర్రాజు’ అని వర్కింగ్ టైటిల్ పెట్టారు. మాస్ మహారాజ రవితేజ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసిందే. అయితే ఈ సినిమాలో రవితేజ రెమ్యునరేషన్‌పై ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. కొన్ని నిమిషాల పాటు కీలక పాత్రలో నటించడానికి రవితేజ ఏకంగా రూ.10 కోట్లు తీసుకుంటున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.