ప్రముఖ కళ్లద్దాల తయారీ సంస్థ రే బాన్ సంస్థ ఛైర్మన్ మిలన్ లియోనార్డో డెల్ వెచియో(87) కన్నుముశారు. ఇటాలియన్ వ్యాపారవేత్త అయిన వెచియో 1961లో లక్సోటికాను స్థాపించారు. తర్వాత ఈ సంస్థ నుంచి రే బాన్ బ్రాండ్ ప్రొడక్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఇటలీలోని బిలియనీర్లలో ఒకడిగా నిలిచే అంతా సంపాదించాడు. డెల్ వెచియో చిన్ననాటి నుంచి అనాథ శరణాలయంలో పెరిగారు. అనాథాశ్రమం నుంచి వ్యాపార సామ్రాజ్య నాయకత్వం వరకు ఎదిగిన ఇతని తీరు.. రేపటి తరానికి ఆదర్శమని పలువురు చెబుతూ నివాళులు అర్పించారు.