రీ కైవైసీ ప్రక్రియపై ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఇకపై ఇందుకోసం బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. రీ కేవైసీ కోసం ఖాతాదారులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందని ఆర్బీఐ పేర్కొంది. ఈ మేరకు ఈమెయిల్, బ్యాకింగ్ యాప్, ఫోన్ నంబర్ తదితర డిజిటల్ ఛానెళ్ల ద్వారా వినియోగదారులకు అవకాశం కల్పించాలని బ్యాంకులకు సూచించింది. కొత్తగా కేవైసీ చేయాలనుకున్న కస్టమర్లు బ్రాంచ్‌కు వెళ్లడం లేదా వీడియో ఆధారిత కస్టమర్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ (V-CIP) ద్వారా పూర్తి చేసుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది.