దేశంలో త్వరలోనే ఈ-రుపీ/ డిజిటల్ రుపీని తీసుకురాబోతున్నామని ఆర్బీఐ ప్రకటించింది. పైలట్ ప్రాజెక్టుగా త్వరలోనే దీనిని తీసుకొస్తామని తెలిపింది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి సంబంధించిన కాన్సెప్ట్ నోట్లో ఈ విషయాన్ని ఆర్బీఐ వెల్లడించింది. ఇందులో డిజిటల్ రుపీ వినియోగం, డిజైన్, ఉపయోగాలు తదితరాలపై చర్చించారు. బ్యాంకింగ్ సిస్టమ్, మానిటరీ పాలసీ తదితరాల్లో డిజిటల్ కరెన్సీ ప్రభావం ఉండనుంది.
త్వరలో e-రుపీ తీసుకురాబోతున్న RBI
