రామ్చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహిస్తున్న RC15 మూవీ బడ్జెట్ అంచనాలకు మించిపోతున్నట్లు తెలుస్తుంది. సినిమాకు అనుకున్న బడ్జెట్ రూ.200 కోట్లు కాగా ఇప్పటికే ఖర్చు 100 కోట్లు దాటింది. షూటింగ్ ఇంకా 45 శాతమే పూర్తయింది. మిగతా చిత్రీకరణకు చాలా సమయంతో పాటు డబ్బు వెచ్చించాల్సి వస్తుందని సమాచారం. మొదట డిసెంబర్ లోపే సినిమాను పూర్తి చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ఏడాది జూన్ వరకు వాయిదా పడింది. దిల్రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శంకర్ సినిమా అంటే అనుకున్న దానికంటే బడ్జెట్ మించిపోతుందనంలో సందేహం లేదు. మరి దిల్రాజు దీన్ని ఎలా నియంత్రిస్తాడో చూడాలి.
లెక్కలను మించిపోతున్న RC15 బడ్జెట్
