డబ్ల్యూపీఎల్‌లో భాగంగా యూపీవారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ టోర్నమెంట్‌లో ఆర్సీబీకి ఇదే తొలి విజయం కావడం విశేషం. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్నిచేధించింది. జట్టులో కనికా ఆహుజా చెలరేగింది. కనికా 30 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 46 పరుగులు చేసి అర్థశతకం ముంగిట ఔటైంది. రిచా ఘోష్(31) చివరి వరకూ క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చింది. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ 2 వికెట్లు పడగొట్టింది.