170 పరుగులు మాత్రమే చేసిన ఆర్సీబీ

© File Photo

గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచులో ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 170 పరుగులు చేసింది. ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ జట్టుకు సరైన ఆరంభం లభించలేదు. కెప్టెన్ ఫాఫ్ (0) త్వరగానే పెవిలియన్ కు చేరుకున్నాడు. కానీ ఆ తర్వాత యువ ఆటగాడు రజత్ పాటిదార్(52) తో కలిసి మాజీ కెప్టెన్ కోహ్లీ (58) ఆర్సీబీని ఆదుకునే ప్రయత్నం చేసినా కానీ ఫలితం లేకపోయింది. తర్వాత మ్యాక్సీ (33) ఆకట్టుకునే ప్రయత్నం చేసినా కుదరలేదు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో ఆర్సీబీ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గుజరాత్ 171 పరుగులు చేస్తే గెలుస్తుంది. కానీ కొన్ని రోజులుగా ఐపీఎల్ మ్యాచులు లో స్కోరింగ్ గేమ్స్ గా నమోదవుతున్నాయి. మరి ఈ రోజు ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Exit mobile version