టాటా ఐపీఎల్ 2022లో భాగంగా నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో RCB 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన CSKలో కాన్వే(56), మొయిన్ అలీ(34) రాణించారు. మిగతా బ్యాటర్లు అంతగా రాణించకపోవడంతో నిర్ణిత ఓవర్లలో CSK 8 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. అటు RCB బౌలర్లలో హర్షల్ పటేల్ 3, మాక్స్వెల్ 2, షాబాజ్ అహ్మద్, హేజిల్‌వుడ్, హాసరంగా తలో వికెట్ తీసుకున్నారు.