పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచులో ఆర్సీబీ జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ టాస్ గెలవగానే మరో ఆలోచన లేకుండా బౌలింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ 4వ స్థానంలో ఉండగా.. పంజాబ్ 8 వ స్థానంలో ఉంది. నేటి మ్యాచ్ గెలవడం పంజాబ్ కింగ్స్ కు చాలా అవసరం. మరో వైపు ఈ గెలుపు ఆర్సీబీకి కూడా అవసరమే. మరి తప్పక నెగ్గాల్సిన ఈ మ్యాచులో ఏ జట్టు గెలుస్తుందో..