హైదరాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్ కిడ్నాప్ కలకలం రేపింది. తన మిత్రుడికి షూరిటీ కింద వేరొక వ్యక్తి నుంచి దిల్షుక్ నగర్- 2 డిపోకు చెందిన డ్రైవర్ అప్పు ఇప్పించాడు. ఈ క్రమంలో డ్రైవర్ స్నేహితుడు సకాలంలో అప్పు చెల్లించలేదు. దీంతో అప్పు ఇచ్చిన వ్యక్తి.. డ్రైవర్ని కిడ్నాప్ చేయించాడు. అనుమానంతో డ్రైవర్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ల చెర నుంచి డ్రైవర్‌కు విముక్తి కల్పించారు. అనంతరం కిడ్నాపర్లను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసులు త్వరలో వెల్లడించనున్నారు.