బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సీరీస్ కోసం సీనియర్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ 12 ఏళ్ల తర్వాత భారత జట్టులోకి పిలుపు వచ్చినట్లు బీసీసీఐ అధికారిక వర్గాలు వెల్లడించాయి. చివరిసారిగా ఉనద్కట్ 2010లో తన మొదటి టెస్టు ఆడాడు. ఆ తర్వాత ఇప్పటివరకు ఒక్క టెస్టు కూడా ఆడలేదు. మళ్లీ ఇప్పుడు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయపడడంతో అతని స్థానంలో ఉనద్కట్ను జట్టులోకి తీసుకున్నారు. విజయ్ హజారే ట్రోఫీలో ఉనద్కట్ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.