ప్రపంచకప్ లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీమిండియా కొత్త ఏడాదిలో మెుదటి సిరీస్ ఆడేందుకు సిద్ధం అయ్యింది. శ్రీలంకతో టీ 20 సిరీస్‌లో భాగంగా మెుదటి మ్యాచ్ వాంఖడే వేదికగా జరగనుంది. సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తుండటంతో ఓపెనర్‌గా చోటు దక్కినట్లే. అతడితో పాటు గిల్ లేదా రుతురాజ్ గైక్వాడ్ ఆడే అవకాశం ఉంది. శివమ్ మావి, రాహుల్ త్రిపాఠి, ముఖేష్ కుమార్ బెంచ్‌కే పరిమితం అయ్యే అవకాశం ఉంది.