అప్పు సహజం. కానీ లంక ప్రభుత్వం మాత్రం చేసిన అప్పులు తీర్చలేక చేతులెత్తేసింది. ఫలితంగా లంకలో ప్రస్తుతం భయానక పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. 2010లో లంకప్రభుత్వం చేసిన చిన్న తప్పిదం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తింది. లెక్కకు మించి అప్పులు చేయడం వల్ల లంక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గడిచిన పదేళ్ల నుంచి లంక కమర్షియల్ లోన్లను ఎక్కువగా తీసుకోవడం వలన ఈ దుస్థితి తలెత్తిందని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. లంకకు ఎక్కువ ఆదాయం టూరిస్ట్ల నుంచే వచ్చేది. కానీ ఇలా వచ్చిన ఆదాయంతో లంక తీసుకున్న అప్పులను తీర్చలేక చతికిల పడింది. లంకలో ఈ పరిస్థితి ఏర్పడడానికి అసలు కారమేంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి