మహిళల ప్రీమియర్ లీగ్ బిడ్డింగ్ ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరింది. ఏకంగా రూ. 4669.99 కోట్ల బిడ్డింగ్ జరిగింది. అదానీ స్పోర్ట్స్ లైన్ రూ. 1289 కోట్లు, ఇండియావిన్ స్పోర్ట్స్ రూ.912.99 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ స్పోర్ట్స్ రూ. 901 కోట్లు, JSW జీఎంఆర్ క్రికెట్ రూ. 810 కోట్లు, క్యాప్రీ గ్లోబల్ బిల్డింగ్స్ రూ. 757 కోట్లు బిడ్ దాఖలు చేశాయి. “ ఇది 2008లో మెన్స్ ఐపీఎల్ రికార్డును బద్దలు కొట్టింది. క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే రోజు. మహిళలకు సరికొత్త బాటలు వేస్తోంది” అని జై షా అన్నారు.