పాకిస్థాన్‌తో టెస్టు మ్యాచులో ఇంగ్లాండ్ రికార్డు బద్దలు కొట్టింది. తొలి సెషన్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ఇంగ్లాండ్ ఘనత సాధించింది. 27ఓవర్లలో 174 పరుగులు చేసి భారత్ రికార్డును(158) అధిగమించింది. అంతేకాకుండా తొలిరోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగానూ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా (494/6)ను దాటేసింది. మొదటి రోజునే నలుగురు బ్యాటర్ల సెంచరీ చేసి ఔరా అనిపించారు. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ క్రాలీ, డకెట్, పోప్ సెంచరీలు చేశారు. రోజు ముగిసే సరికి బ్రూక్(101నాటౌట్) అజేయ సెంచరీతో క్రీజులో నిలిచాడు. అంతకుముందు షకీల్ ఓవర్లో ఆరు బంతులకు ఆరు ఫోర్లను బ్రూక్ బాదాడు. దీంతో ఇంగ్లాండ్ 75ఓవర్లకు 4వికెట్లు కోల్పోయి 506 పరుగులు చేసింది. రావల్పిండి వేదికగా పాక్ బౌలర్లను ఆంగ్లేయులు ఉతికి ఆరేశారు.
రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లాండ్

Courtesy Twitter:@ICC