ఒలింపిక్స్ స్వర్ణ పతక వీరుడు నీరజ్ చోప్రా తన రికార్డును తానే బద్దలు కొట్టాడు. విశ్వక్రీడల తర్వాత తొలిసారి అంతర్జాతీయ ఈవెంట్ లో పాల్గొంటున్న నీరజ్.. మరోసారి జాతీయ రికార్డుతో రజత పతకం సాధించాడు. ఫిన్లాండ్ లో జరుగుతున్న షావో నుర్మి క్రీడల్లో నీరజ్ జావెలిన్ త్రోలో 89.03 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. టోక్యో ఒలింపిక్స్ లో తాను నెలకొల్పిన 87.58 మీటర్ల రికార్డును తానే బద్దలు కొట్టాడు. ఈ ఈవెంట్ లో ఫిన్లాండ్ కు చెందిన ఆలివర్ హెలాండర్ స్వర్ణం నెగ్గగా, అండర్సన్ పీటర్స్ కాంస్యం దక్కించుకున్నాడు.