TS: వేసవి ప్రారంభం కాకముందే విద్యుత్ డిమాండ్ పెరిగిపోయింది. మార్చి 14న గతంలో ఎన్నడూ లేనంతగా డిమాండ్ ఏర్పడింది. ఉదయం 10.03 గంటలకు 15,254 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గతేడాది మార్చి 29న 14,160 మెగావాట్లు నమోదు కాగా ఈ ఏడాది ఈ రికార్డు రెండు సార్లు బద్దలైంది. ఈ నెలలోనే 14,750 మెగావాట్ల డిమాండ్ ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేయాలని డిస్కంలకు ప్రభుత్వం సూచించింది. రోజువారీ డిమాండ్‌లో దక్షిణ భారత్‌లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది.
News Telangana
చెబితే ఒక్క రూపాయి ఇవ్వరు: కేసీఆర్