నిస్సాన్ ఇండియా మాగ్నైట్ SUV మోడల్ కార్లు సరికొత్త రికార్డు సృష్టించాయి. దేశవ్యాప్తంగా 50 వేల బుకింగ్స్ దాటగా, ప్రపంచవ్యాప్తంగా లక్షకు మించి బుకింగ్స్ అయినట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. ఈ క్రమంలో చెన్నై తయారీ ప్లాంట్‌లో 50,000వ మాగ్నైట్ SUVని విడుదల చేశారు. మంచి ధరతో పాటుగా అధిక నాణ్యత మెటీరియల్స్ అందించినందునే అధిక సేల్స్ జరిగినట్లు సంస్థ పేర్కొంది. డిసెంబర్ 2020లో ప్రవేశపెట్టబడిన నిస్సాన్ మాగ్నైట్ ప్రస్తుతం హిట్ మోడల్ గా నిలిచిందని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.