హైదరాబాద్‌లోని నిమ్స్‌లో అసిస్టెంట్ ప్రోఫెసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ఆరోగ్యశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. 132 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీఓ జారీ చేసింది. త్వరలో ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను డిపార్ట్మెంట్ సెలెక్షన్ కమిటీ విడుదల చేయనుంది. విద్యార్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు విధానం గురించి అధికారిక నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు. ఈ ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.