ఏపీలో మాండస్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో చిత్తూరు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చిత్తూరు జిల్లాకు IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది. నాలుగు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.