ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయిన షావోమీ రెడ్మీనోట్ 11 సిరీస్‌ను తాజాగా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా మిడ్ రేంజ్ క్యాటగిరీలో రెడ్మీ నోట్ 11ప్రో + ఫోన్‌ను కూడా లాంచ్ చేసింది. అయితే ఈ ఫోన్ నేడు తొలి సేల్కు వచ్చింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి mi.com, అమెజాన్, ఆఫ్‌లైన్ రెటైల్ స్టోర్లలో కొన్ని యూనిట్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ ఫోనులో 108 మెగాపిక్సల్ కెమెరా, 5000Mah బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 5జీ సపోర్ట్, 6.67 ఇంచెస్ అమోల్డ్ డిస్ప్లే, 120 రీఫ్రెష్‌రేట్, ఈ మొబైల్ అందుబాటులోకి వస్తుంది. ఈ మొబైల్ ధర 6జీబీ RAM, 128 జీబీ స్టోరేజ్‌కు రూ.20,999, 8జీబీ RAM, 128 జీబీ స్టోరేజ్‌కు రూ.22,999, 8జీబీ RAM, 256 జీబీ స్టోరేజ్‌కు రూ.24,999గా ఉంది. HDFC క్రెడిట్ కార్డు ఉపయోగించి మొబైల్ కొనుగోలు చేస్తే అదనంగా రూ.1000 డిస్కౌంట్ లభిస్తుంది.