దేశంలో వంట నూనెల ధరలు తగ్గించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. 2022-24 ఆర్థిక సంవత్సరాల్లో వంటనూనెల దిగుమతిపై పన్ను విధించబోమని ప్రకటించింది. 20 లక్షల టన్నులను ఆర్థికశాఖ టారిఫ్ రేట్ కోటా కింద పేర్కొంది. కోటా దాటి దిగుమతి చేసుకునే నూనెపై సాధారణ పన్ను వర్తిస్తుందని తెలిపింది. మరోవైపు ఇండోనేషియా పామాయిల్ పై ఎగుమతి నిషేధం ఎత్తివేయడంతో కూడా ధరలు తగ్గాయని అంటున్నారు.