ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)2021-22 సంవత్సరానికి భవిష్య నిధి డిపాజిట్లపై 8.1 శాతం వడ్డీని చెల్లించాలని శనివారం నిర్ణయించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం 2020-21లో 8.5 శాతం ఉండగా అంతకంటే తగ్గించింది. ఇది గత 43 ఏళ్లలో అత్యల్ప రేటని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. దీంతో 60 మిలియన్లకు పైగా ఉద్యోగులకు ప్రభావం పడనుందని సమాచారం. చివరిసారిగా 1977-78లో వడ్డీ రేటు 8% ఉన్నప్పుడు EPFO ఈ రేటు కంటే తక్కువ చెల్లించింది. సెంట్రల్ బోర్డు తన ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని 8.1 శాతం వడ్డీ రేటును ప్రకటించినట్లు చెబుతున్నారు.