కృష్ణా జిల్లా గూడూరు మండలం పోసినవారిపాలెంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శాంతమ్మ(80)కు నలుగురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే శాంతమ్మ భర్త బతికుండగా ఆయన పేరున ఉన్న రెండెకరాల భూమిని రెండో కూతురు రూపవతి(45) పేరున రాశారు. దీంతో ఈ భూమి వివాదంలో చిక్కుకోగా.. కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలోనే శాంతమ్మ కొడుకు సహదేవుడు, అతని కుమారులు కేసు విరమించుకోవాలని శాంతమ్మను కోరారు. ఆమె నిరాకరించడంతో రూపవతిని, శాంతమ్మపై కత్తితో దాడి చేసి, నరికి చంపేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.