AP: రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఉన్నత విద్యామండలి సెక్రటరీ నజీర్ అహ్మద్ వెల్లడించారు. ఏటా యూజీ, పీజీ, పీహెచ్డీ పరీక్షలకు ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికి రాయాల్సిన ఈఏపీసెట్ పరీక్షను మే 15 నుంచి 25 వరకు నిర్వహించనున్నారు. ఈసెట్ మే 5న; ఈఏపీసెట్(ఎంపీసీ) మే 15-22, ఈఏపీసెట్(బైపీసీ) మే 23-25; మే 20న ఎడ్‌సెట్, లాసెట్; మే 25-26 ఐసెట్; పీజీఈసెట్‌ను మే 28-30 వరకు; పీజీఈసెట్ జూన్ 6-10; ఆర్‌సెట్ జూన్ 12-14 వరకు జరగననున్నాయి.