సికింద్రబాద్ ప్రమాదంపై నివేదిక విడుదల

yousay

సికింద్రబాద్- రూబీ హోటల్ అగ్నిప్రమాదంపై పోలీసులు ప్రాథమిక రిపోర్ట్‌ను విడుదల చేశారు. ‘సెల్లార్‌లో ఓ ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జింగ్ పెట్టారు. ఛార్జింగ్ ఫుల్ అయినా తీయకపోవడంతో ఆ బైక్‌ నుంచి పొగ వెలువడింది.బ్యాటరీలో లిథియం కెమికల్ ఉండటం వల్ల మంటలు చెలరేగాయి. ఈ మంటలు ఇతర బైక్‌లకు అంటుకున్నాయి. పెద్దఎత్తున పొగ వ్యాపించింది. హోటల్ నాలుగో అంతస్థు వరకు పొగ వ్యాపించింది. కెమికల్ పొగ పీల్చడంతోనే హోటల్‌లోని 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు సెల్లార్ వరకే పరిమితం అయ్యాయి పైకి వ్యాపించలేదు’ అని నివేదికలో పేర్కొన్నారు.

Exit mobile version