తెలంగాణ ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంసెట్ పరీక్షల షెడ్యూల్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపింది. అటు తెలంగాణ ఈసెట్ పరీక్షను జూలై 13వ తేదీన నిర్వహించనున్నట్లు ప్రకటించింది. కాగా జేఈఈ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షలను మే 6వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు జరపనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.